ధ్యానం అంటే "శ్వాస మీద ధ్యాస"... ప్రతి రోజు క్రమం తప్పకుండ ధ్యానం చేయండి....ఇది "చెప్పటం చాల సులభమే, కానీ చేయాలంటే మాత్రం కొంచెం ఆలోచించాల్సిందే"....అని అనిపిస్తోంది అంటే దీనికి కారణం ఒక్కటే మీకింకా ధ్యానం చేసే సమయం రాలేదు అని అర్థం...ధ్యానం చేస్తే మీ గురించి మీకు తెలుస్తుంది...కానీ మీ గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం, మీకు లేదని భావిస్తే .....అపుడు మీకు ధ్యానం చేయాల్సిన అవసరమే ఉండదు...ధ్యానం ద్వారా మీకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది...కానీ మీరు ఆరోగ్యంగానే ఉన్నారు కదా' అని అనిపిస్తుంది...కానీ ఒకటి మాత్రం వాస్తవం మీ జీవితం క్షణ భంగురం, ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చు...ఈ పరిస్థితి నించి బయటపడాలంటే మాత్రం ధ్యానం చేయక తప్పదు...నిజానికి మీ దేహానికి ధ్యానం ద్వారా తనని తాను హీల్ చేసుకునే శక్తి ఉంది.. కేవలం మీరు సహకరించాలి అంతే....అంటె కదలకుండా కూర్చోవాలి... ఇప్పుడు ఉదాహరణకు కదలకుండా ఉంటె... వచ్చే లాభాలు ఏమిటో కూడా చూద్దాం..
కదలకుండా నీటిని పోయ్యి మీద ఉంచితే నీరు మరుగుతాయి...
కదలకుండా ఉన్నపుడు కొలనులోమట్టి కిందికి చేరుకొని నీరు స్వచంగా మారుతాయి ..
కదలకుండా చెట్లు భూమిలో ఉండటం వలన అవి స్వయం పోషకంగా ఉంటాయి..
కదలకుండా బొగ్గు భూమి లోపల ఉండటం వల్ల వజ్రంగా మారుతుంది...
అలాగే కదలకుండా గొంగళి పురుగు గూడుకట్టుకుని ఉంటె అది సీతాకోకచిలుకగా మారుతుంది..
అలాగే మీరు కూడా కదలకుండా కూర్చుంటే పరిపూర్ణులవుతారు...
సృష్టిలోని సమస్తము కదలకుండానే పరివర్తన చెందుతోంది కనుక మీరుకూడా కదలకుండా కూర్చోటం ప్రాక్టీస్ చేయండి..ఇదే ధ్యానము
వ్యాసాలుధ్యానం మరియు అంతర్యానం
ధ్యానం అంటే "శ్వాస మీద ధ్యాస"..
ధ్యానం చేస్తే మీ గురించి మీకు తెలుస్తుంది