Peravaram workshoppleiadian teachings

వ్యాసాలువిశ్వ జ్ఞానం

మానవ దేహం

మానవ దేహం ఎంత శక్తివంతమైనదంటే అది మనసు ద్వారా ఎంత పతనం అయినా తిరిగి తనను తానూ పునర్నిర్మించు కోగలదు

Hari Krishna3 నిమిషాలు

మానవ దేహం ఎంత శక్తివంతమైనదంటే అది మనసు ద్వారా ఎంత పతనం అయినా తిరిగి తనను తానూ పునర్నిర్మించు కోగలదు. ప్రతి అణువు తన సహజ స్థితి లోనికి తిరిగి రాగలదు.. అలా రావటానికి కేవలం మీ సహకారం కావలి అంతే ఆ సహకారమే ధ్యానం...చాలా మందికి ధ్యానం పట్ల చాలా తక్కువ రకం అభిప్రాయాలున్నాయి...ధ్యానం చేస్తే మనసుకి శాంతి అని అలాగే ధ్యానం చేస్తే కొంతవరకు రోగాలు కూడా పోయే అవకాశం ఉంది అని అనుకుంటారు ....కానీ ధ్యానం చేస్తే ఏమి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాము...మీ శరీరం కేవలం కొన్ని అణువుల,పరమాణువుల మిశ్రమం మాత్రమే ...ఈ అణుపరమాణువులు అన్ని ఎప్పుడు ఎలా కావాలంటే ఆలా రూపాంతరం చందగలవు...అలాగే వాటి ఫ్రీక్వెన్సీ ని పెంచుకోగలవు లేదా తగ్గించుకోగలవు...ఇదంతా కేవలం మీ మనస్సు ద్వారా మాత్రమే జరుగుతుంది...మీ దేహం పూర్తిగా మీ మనస్సుని ఫాలో అవుతుంది...మీ మనస్సు సమాజాన్ని ఫాలో అవుతుంది...ఈ సమాజం మూడవ పరిధి సమాజం కనుక మీ మనసుని అధీనం లో ఉంచుకొని తన కనుగుణంగా మలుచుకుంటుంది తద్వారా మీరు సాధారణ మానవుడిని అన్న భ్రమ లోనే జీవిస్తారు ఇది ఒక రకంగా అన్యాయమే... కానీ ఇంతకంటే అన్యాయం ఇంకొకటి ఉంది... అదేంటంటే మీరు మరణించినతరువాత కూడా మీరు ఈ సమాజం ఆధీనంలోనే ఉండి, ఇదేసమాజంలోకి తిరిగి రావాలని నిర్ణయించుకుంటారు...అప్పుడే మీరు జన్మ చక్రంలో పడిపోతారు.... ఈ భూమిపై చాలామంది, వేల సంవత్సరాలుగా ఇక్కడే ఉండిపోయారు..కారణం వారికి నిజం తెలియక పోవడమే..నిజమేమిటంటే మీరు ఈ సమాజాన్ని అధిగమించాలి...ఆలా చేయాలంటే ధ్యానం చేయాలి ప్రతి రోజు కనీసం ఒక గంట నుంచి నాలుగు గంటలు ధ్యానం చేయాలి...మొదటిలో 10 నిముషాలతో ధ్యానం ప్రారంభించండి మెల్లగా మీ సమయాన్ని పెంచుతూ వెళ్ళండి...ధ్యానం చాలా సులభం ఎవరైనా,,ఏ సమయం లోనైనా చేయవచ్చు కళ్ళు మూసుకొని కదలకుండా కూర్చొని శరీరాన్ని అనుభూతి చందండి... మీ హృదయ స్పందన
అనుభూతి చెందండి...శ్వాసను గమనించండి